ETV Bharat / crime

NIA raids in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్‌ఐఏ సోదాలు.. కీలక దస్త్రాలు స్వాధీనం - NIA raids in telangana

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

author img

By

Published : Nov 18, 2021, 10:25 AM IST

Updated : Nov 18, 2021, 7:40 PM IST

09:57 November 18

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

2019 ఛత్తీస్​గఢ్​ బస్తర్ ఎన్​కౌంటర్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు(NIA raids in Telugu states) ముగిశాయి. మావోయిస్టులతో సంబంధాల వ్యవహారంలో ఎన్ఐఏ పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేపట్టింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 14 చోట్ల సోదాలు జరిగాయి.  

రాష్ట్రంలోని హైదరాబాద్​, మెదక్​, మేడ్చల్​, రంగారెడ్డి జిల్లాలు, ఏపీలోని ప్రకాశం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో అధికారుల బృందం సోదాలు(NIA raids in Telugu states) నిర్వహించింది. 2019లో మవోయిస్టులకు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ జావాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు సహా ఒక స్థానికుడు మృతి చెందారు. ఈ ఘటనపై ఛత్తీసగఢ్​ నాగర్​నగర్​లో కేసు నమోదు అయింది. ఈ ఏడాది మార్చి 18న కేసును రీ రిజిస్టర్ చేసిన ఎన్‌ఐఏ(NIA raids in Telugu states).. సుమారు 40మంది అనుమానితులపై కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది.

ఆర్కే పుస్తకంపైనా ఆరా

హైదరాబాద్​ నాగోల్‌లోని రవిశర్మ, అనురాధ ఇళ్లతో పాటు.. అల్వాల్​ సుభాష్​ నగర్​లో నివసించే బంధు మిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లో ఎన్​ఐఏ అధికారులు(NIA raids in Telugu states) సోదాలు చేశారు. ఆర్కే జీవితచరిత్రపై పుస్తకం ప్రచురించే విషయంలోనూ ఆమెను ఆరా తీశారు. వనస్థలిపురం పరిధిలోని చింతలకుంట సమీపంలో ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్) అధ్యక్షుడు కె.రవి చందర్ ఇంటిని ఉదయం నుండి పొలీసులు చుట్టుముట్టారు. అతను ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులు పగులగొట్టి సోదాలు నిర్వహించారు.

ఓయూలోనూ సోదాలు

హిమాయత్ నగర్ వీధి నెంబర్ 14లోని అంబికా టవర్స్ భవనంలోని ఆదిత్య లేడీస్ హాస్టల్​లో తెల్లవారు జామున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏడు గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఓయూ విద్యార్థినులు నివాసం ఉంటున్న వసతిగృహాల్లో సోదాలు చేసి(NIA raids in Hostels) మావోయిస్టులతో సంబంధాలపై ఆరా(NIA questions OU students) తీశారు. విద్యార్థినుల ఆధార్, ఐడీ కార్డులను పరిశీలించారు. పలు కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న ఐదుగురు విద్యార్థినుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన అధికారులు.. వారి వద్ద పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏపీలోనూ తనిఖీలు

ఏపీలోని ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని విరసం నేత కల్యాణ్‌రావు, విశాఖ అరిలోవలోని శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లలో తనిఖీలు చేశారు. సోదాల్లో కీలక దస్త్రాలు, మావోయిస్టు భావజాల పుస్తకాలు, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. 

వారిపైనే ప్రధానంగా దృష్టి

కేరళ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌, తెలంగాణలోని దుమ్ముగూడెం సహా పలు పేలుళ్ల కేసులపై ఎన్‌ఐఏ(NIA raids in Telugu states) దర్యాప్తు చేస్తోంది. పేలుడు పదార్ధాలు సేకరించడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రపన్నడం వంటి వ్యవహారాలతో పాటు.. అమాయక ప్రజలను ఉగ్రవాదంవైపు నడిపించేందుకు ప్రయత్నించడం వంటి అంశాలపై కూడా దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ.. పలు కేసుల విచారణలో భాగంగా సోదాలు నిర్వహించింది. ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. 

Last Updated : Nov 18, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.