ETV Bharat / crime

భార్యను చంపేందుకు ప్లాన్ వేశాడు.. అది తప్పడంతో..!

మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేందుకు పథకం వేశాడు. కానీ ఆమె త్రుటిలో తప్పించుకుంది. కానీ అక్కడే ఉన్న సదరు మహిళ అమ్మమ్మపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Murder
Murder
author img

By

Published : Jan 1, 2023, 4:12 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన సాయి.. భవానీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలోనే సాయి మద్యానికి బానిసయ్యాడు. దీనికి తోడు మద్యం మత్తులో భార్యను వేధించసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు నుంచి భవానీపై సాయి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

మద్యం మత్తులో ఉన్న సాయి.. భార్య, వారి కుటుంబీకులపై కత్తితో దాడికి యత్నించాడు. భయంతో అందరూ పారిపోగా.. ఇంట్లోనే ఉన్న భవానీ అమ్మమ్మ సామ్రాజ్యంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం సాయి కత్తితో వీధుల్లోకి వెళ్లి హల్​చల్ చేశాడు. ఈ క్రమంలోనే స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: ప్రేమంటూ వేధించాడు.. ప్రాణాలు కోల్పోయాడు..!

లారీ, కారు ఢీకొని ఐదుగురు మృతి.. ఓల్డేజ్ హోమ్​లో ఇద్దరు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.