ETV Bharat / crime

అప్పు చెల్లించమన్నందుకు చంపి పూడ్చేశాడు.. - తెలంగాణ వార్తలు

తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు... ఓ వ్యక్తి సదరు మహిళనే హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

murder for money issue at vikarabad district
అప్పు చెల్లించమన్నందుకు చంపి పూడ్చేశాడు..
author img

By

Published : Feb 19, 2021, 2:54 PM IST

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లికి చెందిన నర్సమ్మ స్థానికంగా నివాసముంటుంది. ఉద్యనవన శాఖ వారి రైతు శిక్షణ కేంద్రంలోని వ్వవసాయ క్షేత్రంలో రోజు కూలీగా పని చేస్తుంది. ఈ క్రమంలో నర్సమ్మకు బాబాయ్య​ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. బాబాయ్య తన అవసర నిమిత్తం నర్సమ్మ వద్ద కొంత డబ్బు తీసుకున్నాడు.

తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని నర్సమ్మ అడగడంతో ఈ నెల 26న వ్యవసాయ క్షేత్రానికి రమ్మన్నాడు. అక్కడ ఆమెను చంపి పాతి పెట్టేశాడు. వారం, పది రోజుల వరకు నర్సమ్మ ఇంటికి రాకపోవడంతో... ఆమె అన్న సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాబాయ్యపై అనుమానం వ్యక్తం చేయడంతో... పోలీసులు అతనిని విచారించారు. బాబాయ్య​ నేరాన్ని అంగీకరించి శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపించడంతో... శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

ఇదీ చూడండి: ఎంబీబీఎస్​ చదివినా ఉద్యోగం రాలేదని... ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.