ETV Bharat / crime

కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు - crime news

Mother, two children killed in vijayawada
విజయవాడ వాంబే కాలనీలో తల్లిపిల్లలు హత్య
author img

By

Published : Apr 29, 2021, 8:20 AM IST

Updated : Apr 29, 2021, 11:38 AM IST

08:18 April 29

అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

undefined

ఆ చిన్నారులు ఊహించి ఉండరు.. కన్న తండ్రే కాలయముడిగా మారి ఊపిరి తీస్తాడని. ఏడడుగులు తనతో నడిపించిన వ్యక్తే.. కనికరం లేకుండా హత్య చేస్తాడని ఆ ఇల్లాలు ఊహించి ఉండదు. విజయవాడ వాంబే కాలనీలో జరిగిన మూడు హత్యల నిందితుడిగా భావిస్తున్న మృతురాలి భర్తని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భార్య, పిల్లల్ని చంపి సమీపంలోని రైల్వే ట్రాక్​పై ఆత్మహత్యకు యత్నించినట్లు మోహన్‌ పోలీసులకు తెలిపాడు. ఆ సమయంలో రైలు దగ్గరకు రాగానే.. ప్రాణ భయంతో తప్పుకునే ప్రయత్నంలో గాయాలపాలైనట్లు పోలీసులకు వివరించాడు. 

మోహన్ ఇటీవల భారీగా అప్పులు చేశారు. అప్పు తిరిగి ఇవ్వాలని వారంతా ఒత్తిడి చేయటం... మరో ప్రక్క భార్యతో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. 

ఇవీచూడండి: కనిపించకుండా పోయారు... ఏపీలో శవమై తేలారు

Last Updated : Apr 29, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.