ETV Bharat / crime

MURDER: వివాహేతర సంబంధం.. కొడుకును చంపిన తల్లి - telangana news

అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చింది ఓ కన్నతల్లి. ఐదు పదులు నిండిన ఆ మహిళ.. తన వివాహేతర సంబంధానికి అడ్డు చెబుతున్నాడని కన్న కొడుకును కర్కశత్వంగా హత్య(MURDER) చేయించింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు దీనిని ఛేదించారు.

murder, ap crime news
మర్డర్, ఏపీ నేర వార్తలు
author img

By

Published : Jun 29, 2021, 10:26 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కంచుకోటలో నివాసం ఉంటున్న బాలసుబ్బలక్ష్మి భర్త.. వీరనారాయణ కొన్నేళ్ల కిందట మృతిచెందారు. అప్పటి నుంచి సుబ్బలక్ష్మి పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయమై ఆమె కొడుకు బాలచిన్న తరచూ తల్లితో గొడవ పడేవాడు. తాగుడుకు అలవాటైన బాలచిన్నా.. వివాహేతర సంబంధం పేరుతో డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. దీన్ని జీర్ణించుకోలేని సుబ్బలక్ష్మి.. తన ప్రియుడు శ్రీనివాసులుతో కొడుకును హత్య(MURDER) చేయించాలని నిర్ణయానికొచ్చింది.

కిరాయి హంతకులతో..

శ్రీనివాసులు, ఆదినారాయణ, రామ్మోహన్, బిట్ర ప్రభాకర్​తో కొడుకు హత్యకు(MOTHER PLANNED TO KILL SON BRUTALLY) సుబ్బలక్ష్మి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో కిరాయి హంతకులు.. బాలచిన్నతో పరిచయం చేసుకున్నారు. మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రెండుసార్లు ఈ ప్రణాళిక విఫలం కావడంతో ఈ నెల 16న హత్య చేసేందుకు పక్కాగా సిద్ధమయ్యారు.

మద్యంలో పురుగుల మందు కలిపి మట్టుబెట్టారు..

నల్లచెరువు మండలం పోలే వాండ్లపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో మద్యం తాగేందుకు చిన్నాతో కలిసి నిందితులు నలుగురు వెళ్లారు. మద్యంలో పురుగుల మందుకలిపి తాగించగా.. అపస్మారక స్థితికి వెళ్లిన యువకుడిపై కర్ర, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా కొట్టి చంపారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు.

స్థానికుల ఫిర్యాదుతో బయటకు..

స్థానికుల ఫిర్యాదు మేరకు చిన్నా మృతి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పత్రికల్లో వార్త చూసిన చిన్నా తల్లి సుబ్బలక్ష్మి, భార్య పవిత్ర మృతదేహాన్ని గుర్తుపట్టారు.

అయితే సుబ్బలక్ష్మి వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారం, హతుడి ఫోన్ కాల్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. హత్యకు వినియోగించిన వస్తువులు, నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు.

ఇదీ చదవండి: నీటి సంపులో పడి తల్లి, కుమారుడి మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.