మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని గాజులరామారంలో అమానుషం చోటు చేసుకుంది. కన్నబిడ్డ అనే మానవత్వం లేకుండా వదిలివెళ్లింది ఓ కర్కశ తల్లి. తెల్లవారుజామున షాపూర్ నుంచి గాజులరామారం వైపు.. ఓ తల్లి బిడ్డతో కలిసి ఆటో ఎక్కింది. గాజులరామారంలో ఆటో దిగింది. డ్రైవర్ వేరొకరితో మాట్లాడుతుండగా బిడ్డను వాహనంలోనే పెట్టి వెళ్లిపోయింది.
కొంత సమయం తర్వాత పాప ఏడుపు విన్న డ్రైవర్ ఆటోలో చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. షాపూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ఛైల్డ్ వెల్ఫేర్ టీమ్‌కు పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: గ్రామాల్లో స్వీయ నిర్బంధం... పట్టణాల్లో ఆంక్షలు