ETV Bharat / crime

Woman suicide with daughter: కుమార్తెతో సహా వరద కాల్వలో దూకి తల్లి ఆత్మహత్య - జగిత్యాల నేర వార్తలు

Woman suicide with daughter, Mother commits suicide by jumping into flood canal
కుమార్తెతో సహా వరద కాల్వలో దూకి తల్లి ఆత్మహత్య, బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య
author img

By

Published : Nov 21, 2021, 10:06 AM IST

Updated : Nov 21, 2021, 10:57 AM IST

10:00 November 21

కుమార్తెతో సహా వరద కాల్వలో దూకి తల్లి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో ఆత్మనగర్​లో విషాదం చోటుచేసుకుంది. ఆత్మనగర్​లో కాల్వలో దూకి తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన వనజ.. తన కుమార్తె శాన్విని తీసుకుని శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అర్ధరాత్రి వరకు తిరిగి రాకపోవటంతో.... కుటుంబసభ్యులు చుట్టపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. 

కాల్వలో మృతదేహాలు..

ఉదయం గ్రామశివారులోని వరదకాల్వలో తల్లీకూతుళ్ల శవాలు పైకితేలటం గ్రామస్థులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. తల్లీకుమార్తె మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.  

బావిలో దూకి మరో వివాహిత ఆత్మహత్య

మరో ఘటనలో కుటుంబ కలహాలతో వివాహ బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నిజాం పేట గ్రామంలో వివాహిత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నిజాం పేట గ్రామానికి చెందిన పచ్చిపాల సునీత (33)  తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిలోనే ఉసురు తీసుకుంది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు ఇల్లందు పోలీసులు తెలిపారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇల్లందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

ఇదీ చదవండి: madhurapudi accident today : చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెడితే.. ప్రాణమే పోయింది

Last Updated : Nov 21, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.