ETV Bharat / crime

Suicide attempt at Hospital: పిల్లల ఆరోగ్యం బాగాలేదని.. బాలింత ఆత్మహత్యాయత్నం - mother suicide attempt in hospital

Suicide attempt at Hospital: అప్పుడే పుట్టిన తన పసికందులు చిరునవ్వులు చిందిస్తూ ఉంటే చూస్తూ మురిసిపోవాలనుకున్న ఆ తల్లికి నిరాశే ఎదురైంది. తాను కాన్పులో జన్మనిచ్చిన కవలల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది మానసికంగా కుంగిపోయింది. ఆ బాధలో ఏం చేస్తుందో అర్థం కాక ఆస్పత్రిలోనే ఆత్మహత్యకు యత్నించింది. పాతబస్తీ ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

mother suicide attempt
బాలింత ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 3, 2022, 7:22 PM IST

Suicide attempt at Hospital: హైదరాబాద్​లోని పాత బస్తీ ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఓ బాలింత ఆత్మహత్యకు యత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రాణాలతో బయటపడింది. యాదాద్రి జిల్లాకు చెందిన సంపూర్ణకు.. పాతబస్తీ పెట్ల బుర్జాలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో 5 రోజుల కిందట కాన్పు జరిగింది. కాన్పులో కవలలకు జన్మనిచ్చింది. పుట్టగానే పిల్లల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందించారు.

వికృత చేష్టలు

కవలల ఆరోగ్యం బాగా లేదని మనస్తాపం చెందిన సంపూర్ణ.. మతిస్థిమితం కోల్పోయి వికృత చేష్టలు చేస్తూ ఉండేదని బంధువులు చెప్పారు. ఈ క్రమంలో ఆస్పత్రి మొదటి అంతస్తు వార్డు కిటికీ ద్వారా బాల్కనీలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. గమనించిన తాము.. కేకలు వేయడంతో ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారని వివరించారు. బాలింత కిందకు దూకేటప్పుడు నేల మీద పడకుండా ఆమె బంధువులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే బాధితురాలిని ఆస్పత్రి లోపలికి తరలించిన వైద్యులు చికిత్స అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న చార్మినార్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: MEDARAM Special Busses : మేడారం జాతరకు 4వేల ప్రత్యేక బస్సులు : ఆర్టీసీ ఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.