గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందిన విషాదకరమైన ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక బీసీ కాలనీకి చెందిన తాజుద్దీన్కు కరోనా సోకిందని స్థానికులు తెలిపారు. ఐదు రోజులుగా హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందారు. కుమారుడికి కరోనా పాజిటివ్ అని తెలిసి తల్లి గౌసియా బేగం అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు కరోనా నెగిటివ్ అని ఫలితం వచ్చినా అస్వస్థత నుంచి కోలుకోలేదు.
ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆమెను నారాయణపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చే లోపే కుమారుడు తాజుద్దీన్ పరిస్థితి తీవ్రంగా మారింది. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మరణించారు. గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: కొవిడ్ చిచ్చు: భార్యను చంపిన భర్త ... 108కి ఫోన్ చేసినా రాలేదని ఆత్మహత్యాయత్నం