ETV Bharat / crime

లోన్​యాప్స్‌ వేధింపులకు మరో యువకుడు బలి

author img

By

Published : Jun 9, 2022, 10:29 AM IST

Updated : Jun 9, 2022, 11:17 AM IST

Mohammed Khaza commits suicide with loan apps harassment in javaharnagar, Hyderabad
లోన్​యాప్స్‌ వేధింపులకు మరో యువకుడు బలి

10:27 June 09

లోన్​యాప్స్‌ వేధింపులతో మహమ్మద్‌ ఖాజా ఆత్మహత్య

రాష్ట్రంలో లోన్‌యాప్‌ ఆగడాలకు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌ పరిధిలోని చెన్నపురం సాయిగణేశ్‌కాలనీలో ఉంటున్న మహమ్మద్ ఖాజా అనే యువకుడు 3 లోన్ యాప్స్ ద్వారా అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతరం వారి నుంచి డబ్బులు చెల్లించాలంటూ విపరీతమైన ఒత్తిడి రావడంతో వేధింపులు తట్టుకోలేక ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 9, 2022, 11:17 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.