ETV Bharat / bharat

దసరా ఉత్సవాలకు బంగారు సింహాసనం రెడీ! చరిత్ర ఏంటి? 13పార్ట్​లను ఎలా బిగిస్తారు? - Mysuru Dussehra - MYSURU DUSSEHRA

Mysuru Palace Dussehra 2024 : దసరా ఉత్సవాలకు మైసూర్ ప్యాలెస్ సిద్ధమవుతోంది. ప్రైవేటు దర్బారును నిర్వహించేందుకు రత్నఖచిత బంగారు సింహాసనం మంగళవారం సిద్ధమైంది. ప్యాలెస్‌ ఖజానాలో 13 భాగాలుగా ఉన్న సింహాసనాన్ని నిపుణులు కొన్ని గంటలపాటు శ్రమించి బిగించారు. ఇంతకీ మైసూర్ ప్యాలెస్​కు ఈ సింహాసనం ఎలా వచ్చందో ఈ స్టోరీలో తెలుసుకుందాం

Mysuru Dussehra 2024
Mysuru Dussehra 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 5:12 PM IST

Mysuru Palace Dussehra 2024 : కర్ణాటకలో మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. శరన్నవరాత్రుల్లో ప్రైవేటు దర్బారును నిర్వహించేందుకు రత్నఖచిత బంగారు సింహాసనం సిద్ధమైంది. అంబావిలాస దర్బార్‌ హాల్‌కు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకువచ్చిన సింహాసనం విడిభాగాలను ప్యాలెస్‌లోని నిపుణులు జోడించారు. ప్యాలెస్‌ ఖజానాలో 13 భాగాలుగా ఉన్న సింహాసనాన్ని నిపుణులు కొన్ని గంటలపాటు శ్రమించి బిగించారు.

కాగా, అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు ప్యాలెస్‌ ఆవరణలో సింహాసనంపై ప్రైవేటు దర్బార్‌ కొనసాగనుంది. ఈ సింహాసనానికి రాజవంశస్థుడు కృష్ణదత్త వడయార్‌ సంప్రదాయక పూజలు చేసి అధిరోహిస్తారు. నవరాత్రుల్లో సాయంత్రం వేళ సింహాసనంపై కూర్చుని ప్రైవేటు దర్బారు నిర్వహిస్తారు. దేశంలో రాజ వారసత్వంలో నేటికీ శరన్నవరాత్రి పూజలు మైసూర్ లో మాత్రమే జరుగుతాయి. మైసూర్ రాజభవనంలోనే శరన్నవరాత్రి ఉత్సవాలను 10 రోజుల పాటు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అలాగే ప్రభుత్వం కూడా నాదహబ్బ దసరాను ప్యాలెస్ వెలుపల నిర్వహిస్తుంది.

Mysuru Palace Dussehra 2024
రత్నఖచిత బంగారు సింహాసనం (ETV Bharat)

పూజా కార్యక్రమాలు
శనివారం మైసూర్ దర్బార్ హాలులో 9.55 గంటల నుంచి 10.25 వరకు ఉన్న శుభ లగ్నంలో సింహాసనం విడిభాగాలను అమర్చే కార్యక్రమం మొదలైంది. అంతకుముందు ఉదయం 7.30 గంటలకు రాజభవనం పంచాంగం ప్రకారం నవగ్రహ పూజ, గణపతి హోమం, చాముండేశ్వరి పూజ, శాంతి హోమం నిర్వహించారు.

సింహాసం విడిభాగాలను అమర్చే ప్రక్రియ?
మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సింహాసనం విడిభాగాలను భద్రపరిచిన గది తాళాలను ప్యాలెస్ నిర్వాహక మండలి, రాజకుటుంబం సమక్షంలో బద్దలుకొట్టారు. ప్యాలెస్‌ ఖజానాలో 13 భాగాలుగా ఉన్న సింహాసనాన్ని అంబావిలాసకు తీసుకొచ్చి అమర్చారు. సింహాసనం విడిభాగాలను అమర్చడానికి దాదాపు గంట నుంచి గంటన్నర సేపు పట్టింది. నవరాత్రుల మొదటి రోజున ప్రైవేట్ దర్బార్‌కు ముందు ఈ సింహాసనంపై సింహం బొమ్మను అమరుస్తారు. రాజమాత ప్రమోదా దేవి వడయార్, రాజభవన పరిపాలనా మండలి అధికారులు దర్బార్ హాలుకు మెట్లు, బంగారు గొడుగును తీసుకువచ్చారు.

Mysuru Palace Dussehra 2024
రత్నఖచిత బంగారు సింహాసనంపై రాజవంశస్థుడు (ETV Bharat)

పూజా పద్ధతులు ఎలా?
శరన్నవరాత్రి మొదటి రోజు అంటే అక్టోబర్ 3న చాముండి కొండ వద్ద నాదహబ్బ దసరా వేడుకలు జరుగుతాయి. ఈ క్రమంలో రాజకుటుంబీకులు ప్యాలెస్ లోపల ఉన్న సింహాసనానికి పూజలు చేసి, దాన్ని అధిరోహిస్తారు. విజయదశమి తర్వాత సింహాసనాన్ని ఖజానాలో భద్రపరుస్తారు.

సింహాసనం చరిత్ర
రత్నఖచిత బంగారు సింహాసనం బరువు ఎంతో కచ్చితం తెలియదు. అయితే మైసూర్ సింహాసనానికి ఎలా వచ్చిందనే దానికి పౌరాణిక నేపథ్యం ఉంది. ఈ సింహాసనం పాండవుల యుగానికి చెందినదిగా చెబుతారు. కంపులరాజు దీనిని పెనుగొండలో పాతిపెట్టినప్పుడు, ఈ సింహాసనం పండితుల దృష్టికి వచ్చింది. ఈ విషయం విజయనగర రాజ్య స్థాపకుడైన హరిహరరాయలుకు తెలిసింది. మట్టిలో కూరుకుపోయిన ఈ సింహాసనాన్ని బయటకు తీసుకొచ్చి తన రాజ్యానికి తీసుకొచ్చారు హరిహరరాయలు. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత రత్న సింహాసనాన్ని మైసూర్ రాజు వడయార్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీరంగపట్నం అప్పట్లో మైసూర్ రాజ్యానికి రాజధాని. మైసూరుకు రాజభవనం మారిన తర్వాత సింహాసనాన్ని అక్కడకు తీసుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.