ETV Bharat / crime

ఓటర్లకు డబ్బుల పంపిణీ!.. వైరల్ అయిన వీడియో

author img

By

Published : Mar 14, 2021, 7:26 PM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కార్యకర్తలు అడ్డంగా దొరికిపోయారు. గుట్టు చప్పుడు కాకుండా డబ్బు పంచుతుండగా తీసిన వీడియో వెలుగులోకి వచ్చింది. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్న ఈ వీడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

MLC elections devarakonda nalgonda Money distribution video viral
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం.. డబ్బుల పంపిణీ వీడియో వైరల్

నల్లగొండ జిల్లా దేవరకొండలో ఓ వైపు పోలింగ్​ జరుగుతుంటే.. మరోవైపు ఓటర్లకు తెరాస నేతలు డబ్బులు పంపిణీ చేశారని విపక్ష నేతలు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

దేవరకొండ ఎంపీపీ జాను యాదవ్, వైస్ ఎంపీపీ సుభాశ్ గౌడ్ అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి తరఫున డబ్బులు పంపిణీ చేశారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం చట్టరీత్యా నేరమంటూ మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 10, 618 ఓటర్లుండగా.. 17 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ముగిసింది.

అడ్డంగా దొరికిపోయారు

ఇదీ చదవండి: ఓటమి భయంతో తెరాస దాడులు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.