ETV Bharat / crime

Suicide: పెళ్లి చేసుకోమని యువకుడి వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య - minor girl suicide at indira nagar

పెళ్లి చేసుకోమంటూ ఓ యువకుడు వేధిస్తుంటే తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి.. ఆమె వెంట పడొద్దని అతణ్ని హెచ్చరించారు. అయినా వినకుండా మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. ఈసారి కాస్త డోస్ పెంచి పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని ఆ బాలికను బెదిరించాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక.. తన వల్ల అమ్మానాన్నకు ఆపద రాకుండా ఆపలేక మనస్తాపానికి గురైన ఆ మైనర్.. చివరకు ఉరే(Suicide) సరనుకుంది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.

minor girl suicide, minor girl suicide in Hyderabad
మైనర్ బాలిక ఆత్మహత్య, హైదరాబాద్​లో మైనర్ బాలిక ఆత్మహత్య
author img

By

Published : Jun 14, 2021, 2:19 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​ రోడ్ నంబర్2లోని ఇందిరానగర్​లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవాలంటూ ఓ మైనర్​ను యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఆ బాలిక ఆత్మహత్యరే(Suicide)కు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాడుకు చెందిన బాలిక ఇందిరానగర్​లో నివసిస్తున్న అక్కాబావల ఇంటి వద్ద ఉంటోంది. అదే వీధిలో ఉంటున్న కల్యాణ్ అనే యువకుడు ప్రేమించమని, పెళ్లి చేసుకోమని ఆ మైనర్​ను వేధిస్తుండేవాడు. బాలిక అక్కాబావలు విధులకు వెళ్లడం గమనించిన కల్యాణ్.. అదే అదనుగా భావించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న బాలికను పెళ్లి చేసుకోమని వేధించాడు. లేకపోతే తన తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. అప్పుడే ఇంటికొచ్చిన బాలిక బావ.. అతణ్ని మందలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి.. యువకుణ్ని హెచ్చరించి పంపారు. అయినా కల్యాణ్ బాలికను వేధించడం ఆపలేదు. ఈసారి పెళ్లికి అంగీకరించకుంటే ఏకంగా బాలిక తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన మైనర్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి(Suicide) వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.