Minister Srinivas Goud press meet on illegal liquor: రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని ఉపేక్షించేదే లేదని ఈ తరహా ముఠాలపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నకిలీ మద్యం కేసులో ఎవరున్నా శిక్ష తప్పదని అన్నారు. మద్యం దుకాణాల్లోనూ నకిలీ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒడిశాలో తయారు చేస్తున్న నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలో మద్యం తయారు చేసి తెలంగాణ జిల్లాల్లో ఓ ముఠా సరఫరా చేస్తోందని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారని చెప్పారు. ఒడిశా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారన్నారు. వీరి నుంచి దాదాపు మూడు కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అంతకు ముందు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, నకిలీ మద్యం తయారీ యంత్రాలను పరిశీలించారు.
"తెలంగాణలో ఏ రాష్ట్రం వాళ్లు అక్రమ మంద్యం తయారీ, విక్రయిస్తే శక్షిస్తాం. ఈ ముఠాపై పూర్తి స్థాయి పరిశోధన చేస్తాం. ఇలా అక్రమంగా తయారు చేస్తున్నారని ఎప్వరికైనా అనుమానం వస్తే తెలియజేయండి." -శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: