ETV Bharat / crime

Medical student suicide : స్నేహితులు మాట్లాడటం లేదని వైద్య విద్యార్థిని బలవన్మరణం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Medical student suicide : స్నేహితులు మాట్లాడటం లేదని వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందింది. ఒక్కగానొక్క కుమార్తె ఇలా చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండలవిసేలా విలపిస్తున్నారు.

Medical student suicide, rajendra nagar suicide
స్నేహితులు మాట్లాడటం లేదని వైద్య విద్యార్థిని బలవన్మరణం
author img

By

Published : Jan 10, 2022, 9:57 AM IST

Medical student suicide : స్నేహితులు మాట్లాడటం లేదని వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య తెలిపిన వివరాల మేరకు.. న్యూఫ్రెండ్స్‌కాలనీలో నివసించే సెల్వన్‌, చిత్ర దంపతుల ఏకైక కుమార్తె వినీష(20). తమిళనాడుకు చెందిన వారు ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. ప్రస్తుతం సెల్వన్‌ దంపతులు స్థానికంగా ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు.

ఏం జరిగింది?

Rajendra nagar suicide case : వినీష.. మొయినాబాద్‌లోని ఓ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం విద్యార్థిని. ఆమె చదువుకు ఇబ్బంది కలగకుండా నివాస ప్రాంగణంలోనే ప్రత్యేక గదిని సైతం కుటుంబసభ్యులు నిర్మించారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు విధులకు వెళ్లే సమయానికి వినీష గది తలుపులు తెరవలేదు. ఆలస్యంగా నిద్ర లేస్తుందేమోనని వారు వెళ్లిపోయారు. అనంతరం పలుసార్లు కుమార్తెకు ఫోన్‌ చేసినా కలవలేదు. సాయంత్రం 5గంటలకు తిరిగొచ్చిచూసినా, గది తలుపులు మూసే ఉన్నాయి. అనుమానంతో కిటికి నుంచి చూడగా.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిన తల్లిదండ్రులు.. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

శోకసంద్రంలో తల్లిదండ్రులు

ఇటీవల కళాశాలలో తోటి స్నేహితులతో ఘర్షణ జరిగిందనే విషయాన్ని తమతో పంచుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గొడవ కారణంగానే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సీఐ చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను విగతజీవిగా చూసి గుండలవిసేలా ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తల.. హత్యా...? నరబలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.