ఎంబీబీఎస్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నత చదువులు అభ్యసించినా సరైన ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఘటన చోటుచేసుకొంది.
'ఓల్డ్ బోయినపల్లిలోని సాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న శరణ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ఎంఎస్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. గురువారం.. జీడిమెట్లలోని తన మిత్రుడు రాము వద్ద సాయంత్రం వరకూ ఉన్నాడు. అనంతరం ఓల్డ్ బోయిల్పల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయాడు. అనంతరం శరణ్‌కు అతని తల్లి ఫోన్ చేసింది. స్విచ్ఆఫ్ రావడం వల్ల ఆందోళకు గురై.. రాముకు సమాచారం అందించింది. వెంటనే ఓల్డ్ బోయిన్‌పల్లిలోని శరణ్ నివాసానికి వెళ్లిన రాము, ఇంటికి తాళం వేసి ఉండడం గమనించాడు. కిటికీనుంచి విగత జీవిగా కనిపించిన స్నేహితుడిని చూసి తమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉద్యోగం రావడం లేదనే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: లైవ్ వీడియో: లారీ కింద పడి వస్త్ర వ్యాపారి ఆత్మహత్య