ETV Bharat / crime

భర్త కాపురానికి తీసుకెళ్లలేదని.. వివాహిత ఆత్మహత్యాయత్నం

Married suicide attempt in Manchryala district: ఏ అమ్మాయికైనా పెళ్లి అయ్యాక భర్తే అన్ని. భర్త చూపిన మార్గాన్నే అనుసరిస్తారు. అలాంటిది భర్త పట్టించుకోకపోవడం.. తనను కాపురానికి తీసుకెళ్ల లేదని మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

Married suicide attempt
గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్యయత్నం
author img

By

Published : Jan 10, 2023, 5:33 PM IST

Updated : Jan 10, 2023, 7:25 PM IST

Married suicide attempt in Manchryala district: భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం కన్నాల గ్రామానికి చెందిన వొడ్నాల మౌనికకి, బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బస్తీకి చెందిన వొడ్నాల నరేష్​తో 2014లో వివాహమైంది. 2015లో ఆమె తండ్రి చనిపోవడంతో వారసత్వంగా నరేష్​కు సింగరేణి సంస్థలో ఉద్యోగం వచ్చింది.

వారిద్దరి మధ్య వచ్చిన గొడవలు కారణంగా 5 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. 2018లో ఆమె నరేష్​పై కోర్టులో ప్రైవేట్​ కేసు వేసింది. కోర్టుకు సైతం ఆమె భర్త గైర్హాజరవుతుండే వాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను దగ్గరల్లో ఉన్న బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని ఆరా తీస్తున్నట్లు రెండో పట్టణ ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

"మాకు 2014లో పెళ్లి అయింది. పెళ్లి అయిన నెల రోజుల తరవాత హైదరాబాద్​ వెళ్లిపోయాడు. నన్ను కొన్నిరోజుల ఆగి తీసుకెళ్తాను అన్నాడు. అలా 6 నెలలు గడిచిన ఇంకా రాలేదు. నేను అప్పటి వరకు మామ వాళ్ల ఇంటిలోనే ఉన్నాను. ఆ తరవాత వచ్చి 3 లక్షలు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పాడు. అలానే ఇచ్చాం. అయినా తీసుకెళ్ల లేదు. ఎంతకి వినకపోడంతో కేసు పెట్టాను. అప్పటికి నన్ను కాపురానికి తీసుకెళ్ల లేదు. వేరే ఊర్లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటున్నాడు. నాకు ఎలాగైన న్యాయం జరగాలి." -మౌనిక, బాధితురాలు

ఇవీ చడవండి:

Last Updated : Jan 10, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.