Nageswara Rao: అత్యాచారం ఆరోపణలతో సస్పెండైన మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు, సాంకేతిక ఆధారాలను సరిపోల్చిన వనస్థలిపురం పోలీసులు ఆయనను ఎల్బీనగర్ ఎస్‌వోటీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ కేసులో పూర్తి విచారణ చేసిన తర్వాతే రేపు అరెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6న బాధితురాలి భర్త కర్రతో దాడి చేయడంతో నాగేశ్వరరావు భుజానికి గాయమైందని తెలిపారు. చికిత్స అనంతరం నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నామని ఎస్‌వోటీ పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని, ఆమె భర్తను ఈ నెల 7న కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకు వస్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకు వాడిన కారును కూడా వనస్థలిపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నన్ను కేసులో ఇరికించాడు: టీజీ వెంకటేశ్
మరో వైపు మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరావు కేసు విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ స్పందించారు. నేను రాజ్యసభకు రీ నామినేట్ అయ్యే ముందు తనపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని సంబంధంలేని ఆస్తి వివాదంలో నాగేశ్వరావు నన్ను ఇరికించాడని ఆరోపించారు. ఫిర్యాదుదారులు తనకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా రాసిచ్చినా వినలేదని తెలిపారు. ఇలాంటి అధికారులకు తగిన శిక్ష పడాలని.. అతనికి జీవిత ఖైదు విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీజీ వెంకటేశ్ కోరారు.
అసలేం జరిగిందంటే: తన భర్తపై దాడి చేసి.. తనను అపహరించి ఇన్‌స్పెక్టర్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. అత్యాచారం, ఆయుధ చట్టం కింద నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి: రివాల్వర్ గురిపెట్టి వివాహితపై అత్యాచారం.. మారేడుపల్లి సీఐ అరాచకం
ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం.. రోడ్డుపక్కనే 8ఏళ్ల బాలుడు