ETV Bharat / crime

maoists killed suraveedu ex sarpanch : మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హత్య

Korsa Ramesh
Korsa Ramesh
author img

By

Published : Dec 22, 2021, 11:57 AM IST

Updated : Dec 22, 2021, 8:09 PM IST

11:53 December 22

మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హత్య

రమేశ్‌ను ప్రజాకోర్టులో శిక్షించినట్లు మావోయిస్టుల లేఖ

maoists killed suraveedu ex sarpanch : ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్​ కిడ్నాప్, హత్య, కలకలం రేపాయి. వెంకటాపురం మండలం...కే.కొండాపురం మాజీ సర్పంచ్​ కొర్స రమేశ్​... దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం.. చర్లకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రమేశ్​.... ఇంటికి తిరిగి రాలేదు. మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో... అతని భార్య రజిత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకి హాని తలపెట్టవద్దని...వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన జరిగి 24 గంటలు కాకముందే... ఛత్తీస్​గఢ్ సమీపంలో కొత్తపల్లి గ్రామ అటవీ పరిసరాల్లో రమేశ్​ మృతదేహం ఈ ఉదయం లభ్యమైంది.

ఈ ఘటనపై వెంకటాపురం, వాజేడు కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదలైంది. పోలీస్ ఇన్​ఫార్మార్​గా పని చేస్తున్న రమేశ్​ను ప్రజా కోర్టులో శిక్షించామంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు డబ్బులు ఆశ చూపించి.... రమేశ్​ను ఇన్​ఫార్మర్​గా మార్చుకున్నారని... పాలపొడిలో విషం కలిపి పంపించడంతో తమ వాళ్లు అనారోగ్యం పాలయ్యారని, మ్యాదిరి భిక్షపతి చనిపోయినట్లు లేఖలో తెలిపారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం తలపెట్టినందునే చంపుతున్నామని.. ఇన్​ఫార్మర్లుగా మారే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ... లేఖ విడుదల చేశారు.

అవసరం తీరాగ ఇన్​ఫార్మర్లుగా ముద్రవేసి హత్య చేస్తున్నారు

mulugu sp on ex sarpanch murder : ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం, అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా గిరిజనలు పేదరికంలో మగ్గేలా చూడడమే మావోయిస్టుల సిద్ధాంతమని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ జి పాటిల్​ అన్నారు. పోలీసు ఇన్​ఫార్మర్లుగా ముద్రవేసి మావోయిస్టులు క్రూరంగా హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం మండలం తిప్పాపురం, కొండాపురం గ్రామాలకు చెందిన కొరస రమేశ్​, కురసం రమేశ్​ను మావోయిస్టులు... సోమవారం రాత్రి అపహరించుకుపోయి.. ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని భీమారం గ్రామానికి తీసుకెళ్లారని... అక్కడి నుంచి కళ్లకు గంతలు కట్టించి 7 గంటలు నడిపించుకుని వేరే ప్రాంతానికి తీసుకువెళ్లారని తెలిపారు. అక్కడ రమేశ్​ను కాల్చి చంపి.. రెండో వ్యక్తిని చర్ల మండలంలో వదిలివేశారని తెలిపారు.

వెంకటాపురం మండలం సరిహద్దు కొత్తపల్లిలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూడగా.. అది కొరస రమేశ్​దిగా నిర్ధారించారు. పోలీస్ ఇన్​ఫార్మర్​గా నెపం మోపి రమేశ్​ను మావోయిస్టులు కాల్చి చంపారని.. జిల్లా ఎస్పీ తెలిపారు. పాముకి పాలు పోసినా విషమే కక్కుతుందన్నది గ్రహించి... గిరిజన ప్రజలు మావోయిస్టులకు సహకరించకూడదని కోరారు. ఇప్పడికైనా మావోయిస్టులను హింసను వీడి, లొంగిపోయి, ఏజెన్సీ ప్రాంత అభివృద్దికి సహకరించాలని ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: Maoists kidnap Ex sarpanch: మాజీ సర్పంచ్​ను కిడ్నాప్​ చేసిన మావోయిస్టులు

Last Updated : Dec 22, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.