రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు 7 రోజుల పోలీసు కస్టడీకి మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో హైకోర్టు దంపతులు వామన్ రావు, నాగమణిని నడిరోడ్డుపై నరికి చంపారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ ఉన్నారు. వీరితో పాటు పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను కూడా ఉన్నారు. ఈ కేసులో బిట్టు శ్రీను ఎ-4గా ఉన్నారు. ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులతో కలిపి బిట్టు శ్రీనును పోలీసులు విచారించనున్నారు.
ఇదీ చదవండి: పట్టపగలే న్యాయవాది దారుణ హత్య