ETV Bharat / crime

పోలీసులు చెప్పినా వినలేదు.. వరదలో గల్లంతై వ్యక్తి మృతి...

వరద ఉద్ధృతికి అతను భయపడలేదు. పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. ఈ రెండింటిలో ఏది జరిగినా ఈ ప్రమాదం జరిగేది కాదు. వాగులో గల్లంతై చివరికి మృతదేహంలా లభ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

man died
వరదలో గల్లంతై వ్యక్తి మృతి
author img

By

Published : Sep 28, 2021, 12:11 PM IST

Updated : Sep 28, 2021, 12:43 PM IST

వాగుదాటే క్రమంలో వికారాబాద్‌ జిల్లా పులుసుమామిడి గ్రామానికి చెందిన ఐజాక్‌ అనే వ్యక్తి బైక్‌తో పాటు గల్లంతై మృతి చెందాడు. హైదరాబాద్‌లో బోర్ వైండింగ్ పనిచేసే ఐజాక్‌... పనిముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సిద్ధులూరు నుంచి పులుసుమామిడి వైపు వెళ్లేందుకు వాగు దాటుతుండగా... సోమవారం బైక్‌తో పాటే గల్లంతయ్యాడు. వెంటనే అక్కడ పహారా కాస్తున్న పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా... అప్పటికే వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉదయం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా... వాగు సమీపంలో మోటార్‌ సైకిల్‌ లభ్యమైంది. అత్తాపూర్ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. మృతుడు పులుసుమామిడికి చెందిన ఇషాక్‌ పాషా(26)గా గుర్తించారు.

ఇదీ చూడండి: Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. డ్రైనేజీ గుంతలో పడి ఒకరు గల్లంతు

LIVE VIDEO: హైదరాబాద్​ మణికొండలో గుంతలో పడి వ్యక్తి గల్లంతు

man drowns in nala: డ్రైనేజీలో కొట్టుకుపోయిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ కోసం కొనసాగుతోన్న గాలింపు

Last Updated : Sep 28, 2021, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.