Cyber Crime in Hyderabad : ఐదు వందల రూపాయలతో ఆర్డర్ చేసిన బిర్యానీ రాలేదని.. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే 50 వేల కాజేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ ఖైరతాబాద్‌కు చెందిన భాస్కర్... జొమాటో యాప్‌లో బిర్యానీ ఆర్డర్ చేశాడు. రెండు గంటలైనా బిర్యానీ రాకపోవడంతో గూగుల్ కస్టమర్ కేర్ నంబర్ వెతికాడు. గూగుల్ దొరికిన జొమాటో కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి.. బిర్యానీ రాలేదని చెప్పాడు. అటు నుంచి ఫోన్ మాట్లాడిన వ్యక్తి క్షమాపణ అడుగుతూ.. ఆలస్యానికి పరిహారంగా ఉచితంగా బిర్యానీ ఇస్తామని, చెల్లించిన 500 రూపాయలు తిరిగి చెల్లిస్తామని చెప్పాడు. అందుకోసం వారు పంపిన లింక్ క్లిక్ చేయామని అన్నాడు.
క్లిక్ చేశాడు.. బుక్ అయ్యాడు..
Customer Case Number Scam:వారు పంపిన లింక్ క్లిక్ చేసిన భాస్కర్‌కు.. రెండు నిమిషాల తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి 50 వేలు తీసినట్లుగా సందేశం వచ్చింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 50 వేలు పొగొట్టుకున్నట్లు గుర్తించిన భాస్కర్... సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. కంపెనీల కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ లో వెతకొద్దని.. వారి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడాలని పోలీసులు సూచిస్తున్నారు.
- ఇదీ చదవండి : ఫేస్బుక్ పరిచయం.. కోరిక తీర్చమంటూ బెదిరింపు!