ETV Bharat / crime

Murder: భార్య, అత్తను హతమార్చిన భర్త.. వివాహేతర సంబంధమే కారణమా..? - man killed his wife and mother

man-killed-his-wife-and-mother-at-thirumalagiri-in-secunderabad

author img

By

Published : Sep 16, 2021, 1:26 PM IST

Updated : Sep 16, 2021, 4:52 PM IST

13:22 September 16

కిరాతకం: భార్య, అత్తపై కత్తితో దాడి చేసి హత్య

సికింద్రాబాద్ తిరుమలగిరిలోని మిలటరీ క్వార్టర్స్ వద్ద దారుణం జరిగింది. భార్యను, అత్తను కత్తితో పొడిచి చంపేశాడు. తిరుమలగిరి పరిధిలోని మిలటరీ క్వార్టర్స్ వద్ద నివాసముంటున్న చిన్నబాబు... ఈరోజు ఉదయంపూట తన భార్య నాగపుష్ప, అత్త కుమారిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 

కోపంలో అత్త, భార్యపై దాడి..

చిన్నబాబుకు నాగపుష్పతో వివాహం కాగా.. దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. చిన్నబాబు ఎలక్ట్రిషన్​గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం తలెత్తటం వల్ల.. దంపతులిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి కలహాలు పెచ్చరిల్లాయి. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ.. చిలికిచిలికి గాలివానగా మారింది. ఘర్షణ పెద్దదవుతున్న తరుణంలో నాగపుష్ప తల్లి అడ్డుపడగా.. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన చిన్నబాబు కత్తితో దాడిచేశాడు. అనంతరం భార్యను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా... అక్కడికక్కడే మృతి చెందారు.

వివాహేతర సంబంధమే..

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులను విచారించగా.. కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి తరచుగా గొడవ పడుతున్నట్లు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. రెండు హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. నిందితుడు చిన్నబాబు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 

ఇదీ చదవండి  :  Minister Satyavathi rathod : 'రాజు మృతితో చిన్నారి ఆత్మకు శాంతి'

Last Updated : Sep 16, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.