ETV Bharat / crime

MAN HULCHAL: అన్యాయం జరిగిందని టవర్ ఎక్కి ధర్నా, హైవేపై ట్రాఫిక్ జామ్

వనస్థలిపురం పరిధిలో చింతలకుంట వద్ద ఓ వ్యక్తి టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తన భూమిని అన్యాయంగా సర్పంచ్​ లాక్కున్నారని.. తనకు న్యాయం చేయాలని ఆరోపించాడు. 6 గంటలుగా టవర్​ పైనే ఉండగా.. అతడిని చూడడానికి వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలపడం వల్ల జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది.

MAN HULCHAL: తనకు అన్యాయం జరిగిందని రేడియో టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

author img

By

Published : Aug 27, 2021, 5:02 PM IST

హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని చింతలకుంట వద్ద ఓ వ్యక్తి రేడియో టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట గ్రామానికి చెందిన కృష్ణగౌడ్‌.... తన భూమి ఆక్రమణకు గురైందని ఆందోళనకు దిగాడు. తారామతిపేట సర్పంచ్‌ మహేశ్‌గౌడ్‌ తన భూమిని అన్యాయంగా లాక్కున్నారని... అనంతరం దానిని ఇతరులకు విక్రయించినట్లు వాపోయాడు. ఈ విషయంలో అధికారులు సైతం తనకు న్యాయం చేయటంలేదని సెల్‌టవర్‌ పైకెక్కాడు.

కృష్ణగౌడ్‌ టవర్‌ పైకి ఎక్కటంతో పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకుని... కిందకి దించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 6గంటలుగా టవర్​పైనే ఉన్నాడు. అధికారులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే కిందకు దిగుతానని కృష్ణ గౌడ్​ డిమాండ్​ చేస్తున్నాడు. టవర్​ పైన ఉన్న అతడిని చూడడానికి వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలపడం వల్ల జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఆ ట్రాఫిక్​ను క్లియర్​ చేసేందుకు ట్రాఫిక్​ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

MAN HULCHAL: తనకు అన్యాయం జరిగిందని రేడియో టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

ఇదీ చదవండి: KTR ON FLAG FESTIVAL: 'సెప్టెంబరు 2 నుంచి తెరాస జెండా పండుగ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.