ETV Bharat / crime

నకిలీ రెమ్​డెసివిర్​తో వ్యక్తి మృతి.. ఆసుపత్రిపై కేసు - ఖమ్మం న్యూస్ అప్​డేట్స్

ఖమ్మం నగరంలో నకిలీ రెమ్​డెసివిర్ ఇంజక్షన్ల దందా మరోసారి గుప్పుమంది. నకిలీ రెమ్​డెసివిర్ ఇంజక్షన్ వేయటంతో తన తండ్రికి రోగం ముదిరి చనిపోయారని ఆరోపిస్తూ... ఓ యువకుడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

fake remdesivir injection
fake remdesivir injection
author img

By

Published : May 19, 2021, 7:51 PM IST

గత నెల 24న ఖమ్మం నగర శివారు గొల్లగూడెంకు చెందిన భద్రయ్య అనే వ్యక్తికి కరోనా వచ్చింది. దీనితో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రెమ్​డెసివిర్ ఎక్కించాలని చెప్పి... ఒక ఇంజక్షన్​కు 30వేలు తీసుకుని రెండు వేశారని మృతుడు కుమారుడు తెలిపారు.

ఇంజక్షన్లపై మందు పేరు తెల్ల స్టిక్కర్​పై రాసి అతికించారు. అనుమానం వచ్చి ఆ ఇంజక్షన్ల వీడియో తీశాను. ఇంజక్షన్ వేసిన తర్వాత నా తండ్రికి సిరియస్ అయింది. వేరే ఆసుపత్రిలో చేర్చించాం. అయినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రిలో సరైన వైద్యం చేయలేదని.. కలెక్టర్​కు ఫిర్యాదు చేశా. ఆయన ఆదేశాల మేరకు టూటౌన్​లో కేసు నమోదు చేశాను. - మృతుడి కుమారుడు.

మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: కొవిడ్‌ టీకాల సరఫరాకు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.