man commits suicide while taking a selfie video: హైదరాబాద్లోని కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఫైనాన్స్ సంస్థల వేధింపులు తాళలేక నిజాముద్దీన్ అనే ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి పనికి వెళ్లిన భార్య తిరిగి రాత్రి 9 గంటలకు వచ్చి చూసేసరికి భర్త ఉరి వేసుకొని ఉండటం గమనించింది.
వెంటనే ఇరుగుపొరుగు వారి సహయంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఆఫ్రిన్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ముస్తకాపురా ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న నిజాముద్దీన్(31).. ఫైనాన్స్ సంస్థ వేధింపుల కారణాలతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
భార్యకు దొరికిన సెల్పీ వీడియో ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నపోలీసులు మృతికి ఫైనాన్స్ సంస్థల వేధింపులే కారణమని భావిస్తున్నారు. గత ఆరు నెలలుగా మృతుడు ఎలాంటి జాబ్ చేయడం లేదని.. మృతికి ఆర్థిక ఇబ్బందులు కూడా కారణం కావచ్చునని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మృతుడికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
"నిజముద్దీన్ ఆటో నడుపుతు జీవనం సాగిస్తున్నాడు. సెల్ఫీ వీడియో చూస్తే అతని మరణానికి ఆర్ధిక ఇబ్బందులు కారణం కావచ్చు. ఓ ఫైనాన్స్ సంస్థ అతనని బాగా వేధిస్తోందని తెలుస్తోంది. దర్యాప్తు పూర్తి అవ్వకముందే ఏ విషయం పూర్తిగా చెప్పలేం".- అశోక్ కుమార్, కుల్సంపుర సీఐ
ఇవీ చదవండి: