ETV Bharat / crime

Love Failure : ప్రేమ విఫలమైందని.. పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు - ప్రేమ విఫలమైందని యువకుని ఆత్మహత్య

Love Failure : సోషల్ మీడియాతో మంచి ఎంత జరుగుతుందో కానీ.. చెడు మాత్రం చాలానే జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు.. ఆ తర్వాత స్నేహం.. కొద్ది రోజుల్లోనే ప్రేమ.. తర్వాత మొదలవుతోంది అసలు సంగతి. బెదిరింపులు, బ్లాక్‌మెయిళ్లు, వేధింపుల పర్వాలు షురూ అవుతున్నాయి. ప్రాణాలు తీసుకునే వరకు దారి తీస్తున్నాయి. ఇలా సోషల్ మీడియాలో మొదలైన పరిచయం.. పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకునే వరకు దారి తీసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Love Failure
Love Failure
author img

By

Published : Apr 25, 2022, 10:44 AM IST

Updated : Apr 25, 2022, 12:22 PM IST

Man Suicide due to Love Failure : ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం.. ఒప్పుకోకపోతే చంపడం లేదా చావడం పరిపాటైంది. సోషల్ మీడియాలో మొదలైన పరిచయం చావు వరకు దారి తీసింది. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన అమ్మాయితో ఆ యువకుడు ప్రేమలో పడ్డాడు. కొద్దిరోజులకే ఆ ప్రేమ విఫలమైంది. ఇద్దరూ విడిపోయారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ అమ్మాయిని వేధిస్తూనే ఉన్నాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆ యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న ఆ యువకుడు ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. తాను లేకపోతే చనిపోతానని బెదిరించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని అన్నంత పని చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన యువకుడు సందీప్‌ గుంజపడుగుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు విడిపోయిన తర్వాత కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతడి ప్రవర్తనకు విసుగు చెందిన ఆ యువతి సందీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న బాధ.. మరోవైపు ప్రేయసే తనను పోలీసులకు పట్టించడంతో పెరిగిన కోపం.. అన్నీ కలిసి క్షణికావేశంలో అతణ్ని ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. యువతి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సందీప్‌ను.. గమనించిన యువతి కుటుంబ సభ్యులు, స్థానికులు గోదావరిఖని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 25, 2022, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.