ETV Bharat / crime

Cheating: మీసేవా పోర్టల్ హ్యాక్ చేసిన సెక్యూరిటీ గార్డ్​ - Telangana news

విలాసాలకు అలవాటు పడి మీసేవా పోర్టల్ వివరాలు హ్యాక్ చేసి కమీషన్లను కాజేసిన ఓ వ్యక్తి కటకటలపాలయ్యాడు. మీసేవా ఫిర్యాదు మేరకు సదురు వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

cheater
cheater
author img

By

Published : May 26, 2021, 7:21 PM IST

Updated : May 26, 2021, 8:40 PM IST

మీసేవా పోర్టల్ వివరాలు హ్యాక్ చేసి పలు సేవల ద్వారా వచ్చే కమీషన్లను కాజేసిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్​కి చెందిన కాసాని జగన్ నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విలాసాలకు అవాటుపడి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ద్విచక్ర వాహనాలకు ఉన్న చలాన్లు కట్టడానికి మీ సేవ సెంటర్​కు వెళ్లినపుడు లాగిన్ వివరాలు తస్కరించాడు.

తన స్నేహితులు, యూట్యాబ్​లోని వీడియోల ద్వారా మీ సేవా పోర్టర్​లో లాగిన్ అయ్యాడు. ఈసీ లాంటి పలు కీలక డాక్యుమెంట్లు నుంచి వచ్చే కమీషన్​ను తన ఖాతాలకు మళ్లించుకున్నాడు. తన ఐడీ ద్వారా ఇదంతా జరిగిందని తెలుసుకున్న మీసేవా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఐపీ అడ్రస్ ద్వరా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Last Updated : May 26, 2021, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.