ETV Bharat / crime

ATM CHORI: సైబర్ దొంగల కొత్త తెలివి.. ఇలా ఏటీఎంలను దోచేశారు! - తెలంగాణ వార్తలు

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉంటున్నాయి. కానీ ఏటీఎంలలో డబ్బులు మాయమవుతున్నాయి. కొన్నాళ్లుగా ఈ విషయం బ్యాంకు అధికారులకు తలనొప్పి రప్పిస్తోంది. ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు.. ఇది హరియాణా మూఠా పనిగా నిర్ధారించారు.

CHORI
ఏటీఎంలనే దోచేస్తున్నారు
author img

By

Published : Aug 23, 2021, 9:52 AM IST

ఏటీఎం యంత్రాల్లో నుంచి నగదు మాయమవుతోంది. దొంగలు పడ్డారా! అంటే లేదు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. మరి డబ్బులెలా పోతున్నాయి? పైగా ఓ ప్రధాన బ్యాంకు ఏటీఎంలలోనే నగదు మాయమవడం ఏమిటి? ఈ విషయమే కొంత కాలంగా ఆ బ్యాంకు అధికారులను తలలు పట్టుకునేలా చేస్తోంది. పోలీసులు దర్యాప్తు ఆరంభించడంతో ఇదంతా హరియాణా ముఠా పనిగా తేలింది.

బయటపడిందిలా..

హైదరాబాద్‌.. విద్యానగర్‌ ప్రాంతంలో ఉన్న తమ ఏటీఎం కేంద్రంలోని డిపాజిట్‌ యంత్రం నుంచి రూ.50 వేలు మాయమైనట్టు ఓ బ్యాంకు అధికారులు జూన్‌ 19న నల్లకుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ఆరంభించిన పోలీసులు జూన్‌ 18న ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అయిదు దఫాలుగా నగదు డ్రా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు గుట్టు బయటపడింది. ‘హరియాణాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైదాబాద్‌లో ఆటో ఎక్కారు. అంతకుముందు సైదాబాద్‌లోని అదే బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి రూ.1.24 లక్షలు డ్రా చేశారు. నాగోల్‌లోనూ ప్రయత్నించారు. అక్కణ్నుంచి విద్యానగర్‌కు వచ్చారు. చిక్కడపల్లి వీఎస్‌టీ వద్ద ఉన్న ఏటీఎం నుంచి రూ.3 లక్షలు తస్కరణకు గురైనట్టు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కొంతకాలం కిందట ఫిర్యాదు అందింది. తిరుమలగిరి, హయత్‌నగర్‌లలోనూ ఇలానే జరిగింది. ఈ దొంగతనాలు కూడా ఆ ముఠా పనేననే నిర్ధారణకు వచ్చాం’ అని పోలీసులు తెలిపారు.

ఎలా చేస్తున్నారంటే...

‘‘ఏటీఎం కేంద్రాల్లోని పాత డిపాజిట్‌ యంత్రాలను దొంగలు ఎంచుకుంటున్నారు. ఈ యంత్రాల్లో డబ్బు వేయడానికి, తీసుకోవడానికి ఒకే పెట్టె ఉంటుంది. తొలుత డెబిట్‌ కార్డుతో కొంత మొత్తం తీసుకుంటారు. ఆ తర్వాత ఓ వ్యక్తి పెట్టె పూర్తిగా తెరుచుకోకుండా చేత్తో గట్టిగా పట్టుకుంటాడు. మరోవ్యక్తి ఆ కొంచెం ఖాళీ నుంచి లోపలున్న నగదు తీసుకుంటాడు. ఈ క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఏటీఎం తెరపై కన్పిస్తుంది. లావాదేవీ జరగలేదనే (ఫెయిలయినట్లు) సంక్షిప్త సందేశం సంబంధిత వ్యక్తికి వస్తుంది. డ్రా చేసిన డబ్బు తిరిగి అదే ఖాతాలో జమవుతుంది. హరియాణాకు చెందిన ఈ ముఠా హైదరాబాద్‌లోనే కాకుండా దిల్లీ, ముంబయి, తిరువనంతపురంలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడింది. ఇటీవల చెన్నై పోలీసులు ఓ ముఠాను అరెస్ట్‌ చేశారు. 38 మంది సభ్యులున్న ఈ బృందం ఒక్క చెన్నైలోనే రూ.5 కోట్ల మేర దోచుకున్నట్టు గుర్తించాం’’ అని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: Cyber Crime: కొడితే బ్యాంకుల్నే కొట్టాలి!.. సైబర్‌ నేరగాళ్ల నయా ఎత్తుగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.