హాస్టల్ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో(Student Suicide attempt at nalgonda) జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన బచ్చు ఊమా మహేశ్వరి... నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీలో గల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి(gurukula student Suicide attempt) చదువుతుంది. ఈ నెల 2న ఇంట్లో శుభకార్యం ఉండటంతో విద్యార్థిని తల్లి వచ్చి తీసుకెళ్లింది.
శుభకార్యం అనంతరం ఆమెను తిరిగి ఆదివారం రోజు హాస్టల్‌కు తీసుకురాగా... తనకు ఈ పాఠశాలలో చదవడం ఇష్టం లేదని కాసేపు తల్లితో మారం చేసింది. దీంతో తల్లి సర్ది చెప్పి పాఠశాల గేట్ బయటికి వెళ్లగానే... విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి (Student Suicide attempt) పాల్పడింది. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు ఉమా మహేశ్వరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థిని కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Pedakakani Rape Case: ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. వృద్ధుడి అరెస్ట్