Lowland cultivators Attack on Forest Officer: ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పోడు రైతులకు, అటవీ సిబ్బందికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా భద్రాద్రిలో అటవీ అధికారిపై పోడుభూముల సాగుదారులు కత్తితో దాడి చేశారు. చంద్రుగొండ అటవీ రేంజర్ శ్రీనివాసరావుపై కత్తితో దాడికి పాల్పడ్డారు. బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో దాడి జరిగింది. అటవీ రేంజర్ శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా... ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

అటవీశాఖ నాటిన మెుక్కలు తొలగించేందుకు పోడు సాగుదారుల యత్నించగా... అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై దాడికి పాల్పడ్డారు. దీంతో అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు భయంతో పరారయ్యారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌పై పోడు భూముల సాగుదారులు కత్తితో దాడి చేశారు.
ఇవీ చూడండి: