ETV Bharat / crime

Lovers suicide: అటవీప్రాంతంలో పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య - Lovers suicide in ap

ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో... చివరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో గల కలువాయి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Lovers suicide: అటవీప్రాంతంలో పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

author img

By

Published : Jan 21, 2022, 8:34 PM IST

Lovers suicide in Nellore: ఏపీలోని నెల్లూరు జిల్లా కలువాయి అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. కలువాయి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, తులసి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటంతో.. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు.

వీరిద్దరు కనబడకపోయేసరికి కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా.. అచూకీ లభించలేదు. అయితే వారిద్దరు ఇవాళ.. కలువాయి సమీప అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.