ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని వేటపాలెం మండలం దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ రైలు పట్టాలపై యువ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
మృతి చెందిన యువతి విఘ్నేశ్వర కాలనీకి చెందిన గొర్రెముచ్చు సుధాకర్ రెండో కుమార్తె షకీనా(18)గా గుర్తించారు. ఆమెతో పాటు ఆత్మహత్య చేసుకున్న యువకుడు మైలవరపు సాయి సతీశ్(20)గా తేల్చారు. వీరిద్దరు ప్రేమించుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చీరాల ఎస్సై నాగరాజు తెలిపారు. ఈక్రమంలో ఇంట్లో పెద్దవారు ఒప్పుకోరని భావించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. మృతుల కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చినట్లు ఎస్సై వెల్లడించారు.
ఇదీ చదవండి: 'రూ.50 వేలు పంపండి.. లేకుంటే పదోన్నతి ఆగిపోతుంది'