ETV Bharat / crime

suicide attempt: మైనర్​తో కలిసి 42ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. బాలిక పరిస్థితి విషమం - ఏపీ నేర వార్తలు

ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ లాడ్జిలో 17 ఏళ్ల బాలిక, 42 ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

suicide attempt: లాడ్జిలో ఆత్మహత్యాయత్నం.. బాలిక పరిస్థితి విషమం

author img

By

Published : Aug 18, 2021, 5:31 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రేమ పేరుతో ఓ జంట ఆత్మహత్యకు యత్నించారు. పట్టణంలోని ఓ లాడ్జిలో 17 ఏళ్ల బాలిక, 42 ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన లాడ్జి సిబ్బంది.. ఆసుపత్రికి తరలించారు.

దగదర్తి మండలం బాడుగులపాడుకు చెందిన రామయ్య అనే 42 ఏళ్ల వ్యక్తి, జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన 17 ఏళ్ల బాలికతో ప్రేమాయణం సాగించాడు. రామయ్యకు ఇది వరకే వివాహమై ఇద్దరు ఆడ పిల్లలుండగా.. మగ పిల్లాడి కోసం వరసకు మరదలయ్యే బాలికతో ఈ వ్యవహారం సాగించినట్లు తెలుస్తోంది.

మంగళవారం బాలికతో కలిసి బుచ్చిలోని లాడ్జికి వచ్చిన రామయ్య.. తండ్రీకూతురని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఈరోజు ఉదయం ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని లాడ్జి సిబ్బంది గుర్తించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సెలవుపై ఇంటికి వచ్చి.. రోడ్డు ప్రమాదానికి బలై.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.