Love cheating: ప్రేమ పేరుతో యువకుడు మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి యువతి నిరసన చేపట్టింది.ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం కిరికేరా గ్రామానికి చెందిన యువతి, కర్నూలు జిల్లాకు చెందిన గణేష్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం శారీరకంగా లోబర్చుకుని, పెళ్లి మాట వచ్చేసరికి మొహం చాటేశాడని యువతి ఆరోపించింది. తనను మోసం చేశాడని, గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తనను పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బాధిత యువతిపై పోలీసులు కుల వివక్షత చూపుతున్నారని కుల వివక్ష పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామంటూ పోలీసులు చెబుతున్న తనకు రక్షణ ఎక్కడ కల్పించారు అంటూ పోలీసు శాఖను ఆ యువతి నిలదీసింది.
ఇవీ చదవండి: