సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల రహదారిపై ఓ లారీ అదుపుతప్పి.. గొర్రెల మందపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో 48 మూగజీవాలు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 13 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రహదారిపై ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎఫ్‌డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య