ETV Bharat / crime

విషాదం.. మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మృతి - guntur labours death incident

labours died in Guntur
labours died in Guntur
author img

By

Published : Mar 16, 2022, 12:05 PM IST

Updated : Mar 16, 2022, 3:59 PM IST

12:03 March 16

విషాదం.. మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మృతి

మట్టిపెళ్లల కింద చిక్కుకున్న కూలీలు

Tragedy in Guntur : పొట్టకూటికోసం ఇతర రాష్ట్రాల నుంచి ఊరుగాని ఊరు వచ్చిన వలస కూలీల బతుకులు మట్టిపెళ్లల కింద నలిగిపోయాయి. కూలీ పనులు చేస్తూ.. జీవనం సాగిస్తున్న వారిపై మృత్యువు మట్టిపెళ్లల రూపంలో విరుచుకుపడింది. బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం పునాదుల తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డినగర్‌లో జరిగింది.

ముత్యాలనగర్‌లో బహుళ అంతస్తుల భవనం నిర్మాణం కోసం సుమారు 40 అడుగుల మేర పునాది తవ్వారు. దానికి అనుబంధంగా కాంక్రీట్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వాళ్లలోని కొందరూ.. మట్టిపెళ్లలు విరిగిపడటాన్ని గమనించి బయటకు పరుగులు తీయగా.. ఇద్దరు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. ఘటన జరిగిన వెంటనే జేసీబీ సాయంతో సహాయ చర్యలు చేపట్టగా.. ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతులు ఇద్దరు మజ్బుల్‌ (బిహార్‌), మజ్ను‍‌ (బెంగాల్)గా గుర్తించారు.

ప్రమాదం సమయంలో అక్కడ ఆరుగురు పనిచేస్తుండగా.. ఇద్దరు చనిపోయారు. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న అమీన్(బంగాల్‌).. ​గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. రక్షణ చర్యలు చేపట్టలేదని.. ప్రమాదం జరుగుతుందని తాము హెచ్చరించినా గుత్తేదారు పట్టించుకోలేదని కూలీలు కన్నీటిపర్యంతమయ్యారు.

అనుమతి లేకుండానే భవన నిర్మాణం

"జీప్లస్‌ 6 భవన సముదాయం నిర్మాణానికి దరఖాస్తు వచ్చింది. ప్లానింగ్‌లో లోపాలు ఉన్నాయని అనుమతులు ఇవ్వలేదు. లోపాలు సరిచేసే వరకు పనులు ఆపాలని చెప్పాం. ప్రమాద సమయంలో ఆరుగురు పనిచేస్తున్నారు. మరణించిన ఇద్దరి మృతదేహాలు వెలికితీశాం. గాయపడిన ముగ్గురికి ప్రాణాపాయం లేదు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి ఆందోళనకరం. ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. అధికారుల తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం." - నిశాంత్‌కుమార్‌, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌

కార్పొరేషన్‌ అనుమతివ్వలేదు

కార్పొరేషన్‌ అనుమతి లేకుండా సెల్లార్‌ నిర్మాణానికి పనులు చేపట్టారని గుంటూరు మేయర్‌ మనోహర్‌నాయుడు అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఘటన దురదృష్టకరమని చెప్పారు. దీనికి బాధ్యులైన యాజమాన్యం, అధికారులను ఉపేక్షించేది లేదని.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Last Updated : Mar 16, 2022, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.