ETV Bharat / crime

FAKE CURRENCY: సినీఫక్కీలో నకిలీ నోట్ల చలామణీకి యత్నం.. నిందితుల అరెస్ట్​ - fake currency gang arrest in hyderabad

జై లవకుశ సినిమా చూసే ఉంటారు కదా.. అందులో హీరో ఓ దొంగ.. తాను దొంగిలించిన సొత్తంతా డీమానిటైజేషన్​ ఎఫెక్ట్​తో ఎలా మార్చుకోవాలా అని సతమవుతుంటాడు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో డీమానిటైజేషన్​ పద్ధతినే ఫాలో అవుతాడు. త్వరలో రూ. 2వేల నోట్లు రద్దు కాబోతున్నాయని విలన్​ను నమ్మిస్తాడు. అతని వద్ద నుంచి నల్లధనం మొత్తం దోచుకుంటాడు. అదే తరహాలో భారీ మోసానికి యత్నించిన ఓ నకిలీ కరెన్సీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

fake currency gang arrest
నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు
author img

By

Published : Sep 11, 2021, 3:18 PM IST

Updated : Sep 11, 2021, 6:01 PM IST

బహిరంగ మార్కెట్​లో త్వరలో 2వేల రూపాయలను రద్దు చేస్తున్నారని.. వాటిని అతి తక్కువ ధరకు దక్కించుకోవచ్చని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలో చిత్రీకరణ కోసం ఉపయోగించే డమ్మీ 2వేల నోట్ల రూపాయలను చూపించి మోసాలకు పాల్పడుతున్న కరీంనగర్​కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. కోటి డమ్మీ 2వేల నోట్లను, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సినీ ఫక్కీలో

కరీంనగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే భాగ్యకు అజీజ్ అనే పాత నేరస్థుడితో పాటు, అన్వర్, సుభాష్, నాగరాజుతో పరిచయం ఏర్పడింది. డబ్బుల కోసం మోసాలకు పాల్పడేందుకు ఈ ముఠా పథకం వేసింది. ఈ క్రమంలో రాజిరెడ్డి అనే స్థిరాస్థి వ్యాపారిని భాగ్య పరిచయం చేసుకుంది. కోటీశ్వరులు నల్లధనాన్ని అతి తక్కువ నగదుకే ఇస్తున్నట్లు రాజిరెడ్డిని నమ్మించింది. రూ. 2వేల నోట్లు త్వరలో రద్దు కాబోతున్నాయని.. ధనికులంతా 500, 200 నోట్లను తీసుకుని రూ. 2వేల నోట్లను ఇస్తున్నట్లు మాయమాటలు చెప్పింది.

కేసు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​

పోలీసు అవతారంలో

నిజమేనని నమ్మిన రాజిరెడ్డి.. నల్లధనం తీసుకోవడానికి తన వద్ద ఉన్న రూ. 5లక్షలు తీసుకొని శామీర్ పేట్​లోని ఓ ఫామ్ హౌజ్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ అన్వర్, అతని ముఠా సభ్యులు మాటు వేశారు. ముఠాలోని ఓ సభ్యుడు పోలీసు దుస్తులు వేసుకుని రాజిరెడ్డిని బెదిరించాడు. నల్లధనం దందా చేస్తున్నావని బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 5లక్షలు తీసుకుని పంపించేశాడు. వారం తర్వాత రాజిరెడ్డి తనకు జరిగిన మోసాన్ని గుర్తించి.. కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు డమ్మీ నోట్ల దందాను బయటపెట్టారు.

ఈ నకిలీ కరెన్సీ చలామణీకి యత్నించిన ఐదుగురు సభ్యులు.. కరీంనగర్‌ వాసులుగా గుర్తించామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. కోటి విలువైన నకిలీ నోట్లతో పాటు లక్ష నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ. లక్షకు 5 లక్షల నోట్లు ఇస్తామని బాధితులను మోసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారని సీపీ వెల్లడించారు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి.. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని మహేశ్‌ భగవత్ వివరించారు.

నకిలీ నోట్ల కట్టపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అని ముద్రించారు. రెండు వేల నోటుపై కేవలం షూటింగ్‌ కోసమే అని ముద్రించారు. ఇవన్నీ చూసుకోకుండా బాధితులు మోసపోయారు. ఇంకా ఎంతమంది మోసపోయారో వివరాలు సేకరిస్తున్నాం. లక్ష నగదుతో పాటు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాం. -మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ

ఇదీ చదవండి: Jyotiraditya Scindia : డ్రోన్ పాలసీపై కేంద్రానికి స్పష్టమైన ఆలోచన ఉంది: జ్యోతిరాదిత్య

Last Updated : Sep 11, 2021, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.