గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ద్విచక్ర వాహనానికి సంబంధించిన తాళాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఆ వాహనాన్ని గుర్తించగా అది కర్ణాటకకు చెందినదిగా దర్యాప్తులో తేలింది. మృతుడు పోలీసుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య