గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కాసాని బలరాం హైదరాబాద్ షాపూర్ నగర్లో నివాసముంటున్నాడు. కామాక్షి ట్రాన్స్ఫర్స్లో లేబర్‌గా పనిచేస్తున్నాడు.
సుమారు లక్ష రూపాయల విలువ చేసే 170 మద్యం సీసాలను బలరాం డీసీఎంలో తరలిస్తున్నాడనే సమాచారంతో జీడిమెట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని 170 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి : Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి