మున్సిపల్ ఉద్యోగినంటూ పలు దుకాణాల్లో వసూళ్లకు పాల్పడిన డ్రైవర్‌ను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వెంకటేష్.. మంగళవారం రోడా మేస్త్రీ నగర్లో ఉన్న ఓ బేకరీ వద్దకు వెళ్లి తాను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి వచ్చానని పరిచయం చేసుకున్నాడు. బేకరీలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నందున రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఇలా పలు దుకాణాల్లో యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు అతడిపై స్థానికంగా నివసించే జితేందర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు వెంకటేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: ఆర్ అండ్ బీ శాఖలో రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం: ప్రశాంత్ రెడ్డి