Intelligence Officials Alerted in PFI conspiracy Telangana: పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్‌తో పాటు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరిగొచ్చని తెలిపారు. ఈ మేరకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించారు. కేరళ, తమిళనాడులో పీఎఫ్ఐ కార్యకర్తలు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు.
ఈ మేరకు తెలంగాణలోనూ పీఎఫ్ఐ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ అధికారుల అధ్యయనంలో తేలింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులు నిఘా పెట్టాలని.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఇంటిలిజెన్స్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా పలు చోట్లు దాడులు చేసి పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు.
చాంద్రయణగుట్టలో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు.. మత ఘర్షణలు సృష్టించేందుకు వాటిని వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా పలువురు పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసిన అధికారులు వాళ్ల నుంచి కీలక సమాచారం సేకరించారు. పీఎఫ్ఐ ని నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీకారంగా పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులకు దిగే ప్రమాదముందని ఇప్పటికే కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.
ఇవీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 26 మందిపై కేసు.. నలుగురు అదుపులోకి..
పీఎఫ్ఐ కేసులో నిజామాబాద్, భైంసా, జగిత్యాలలో ఎన్‌ఐఏ సోదాలు
ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ... అదృశ్యమైన వారు ఏమవుతున్నారు?
'నా లవర్‌తో మాట్లాడించండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా'.. పోలీస్‌స్టేషన్ ఎదుట యువకుడు హల్చల్!