ETV Bharat / crime

Live Video : శిల్పకళా వేదికలో స్టేజ్‌ నుంచి పడి ఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి - Intelligence Bureau assistant director Amiresh dead

intelligence-bureau-assistant-director-amiresh-died-

author img

By

Published : May 18, 2022, 10:54 PM IST

Updated : May 18, 2022, 11:46 PM IST

22:42 May 18

శిల్పకళా వేదికలో స్టేజ్‌ నుంచి పడి ఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి

హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ స్థాయి అధికారి అమిరేశ్‌ ప్రమాదవశాత్తు వేదికపై నుంచి పడి మృతి చెందారు. శిల్పకళా వేదికలో శుక్రవారం సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తకం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు.

ఇందులో భాగంగా భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా... అధికారులు వేదికను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఫొటోలు తీస్తూ... వేదిక సమీపంలోని గుంతలో పడిపోయారు. తలకు తీవ్రగాయాలైన అమిరేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అమిరేశ్‌... బిహార్‌ వాసిగా అధికారులు తెలిపారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం: అమిరేశ్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమిరేశ్‌ మృతి వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Last Updated : May 18, 2022, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.