ఏ మహిళ అయినా తల్లి కాబోతుందని తెలియగానే సంబరపడిపోతుంది. అమ్మా అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంది. ఆ పిలుపు వినపడగానే లోకాన్నే జయించినంత అనుభూతి పొందుతుంది. వారి కోసం ఎన్ని కష్టాలు భరించడానికైనా సిద్ధపడుతుంది. బిడ్డ కడుపులో ఉన్న తొమ్మిది నెలలు.. ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ప్రతి క్షణం ఆ బిడ్డ కదలికలను స్పర్శ ద్వారా అనుభూతి చెందుతుంది. ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ తన బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని.. తన ఒడిలో పెట్టుకొని ఈ లోకాన్ని ఎప్పుడు చూపిస్తానా అని కలలు కంటుంది.
బహుశా తల్లీబిడ్డ ఇద్దరికీ అంతే ఆతృత ఉంటుందో ఏమో.. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. బిడ్డ కోసం తల్లి ఎంత పరితపిస్తుందో.. ఆ తల్లి స్పర్శతో అంతే ఆనందం పొందాలని ఆ చిన్నారి ఎదురుచూస్తుంది. అమ్మ చనుబాలను అందుకుంటూ మధ్యమధ్యలో పక్కకు తిరిగి లోకాన్ని చూస్తుంది.
పేగు బంధంలో ఇంత గొప్ప ఆనందం ఉంటుంది. కానీ ఇంతటి ఆనందం ఆ తల్లికే కాదు.. ఆ బిడ్డకూ దూరమైంది. ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదు. శిశువు పుట్టీ పట్టగానే.. తల్లి పొత్తిళ్లలో కాకుండా చెత్త కుండీకి చేరాడు. అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన బాబు.. చెత్తకుండీలో శాశ్వతంగా(Infant dead body in dustbin) కనుమూశాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అంబర్పేట్ పీఎస్ పరిధిలో అప్పుడే పుట్టిన పసికందుబాబును చెత్త కవర్(Infant dead body in dustbin)లో చుట్టి ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం పక్కనే ఉన్న చెత్త కుండీలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. రోడ్లు శుభ్రం చేస్తుండగా(Infant dead body in dustbin) గమనించిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృత శిశువును(Infant dead body in dustbin) ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Sexual abuse: చిన్నారులపై మృగాళ్ల కన్ను... రోజురోజుకు పెరుగుతున్న నేరాలు