ETV Bharat / crime

తోడబుట్టిన సోదరిపై సోదరుడు కత్తులతో దాడి... కారణం అదేనా? - సోదరిపై సోదరుడు కత్తులతో దాడి

Brother Attack on Sister with Knife: భూ తగాదాలతో తోడబుట్టిన సోదరులే.. సోదరి, ఆమె కుటుంబీకులపై కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Knife attack
కత్తులతో దాడి
author img

By

Published : Mar 23, 2022, 9:18 AM IST

Brother Attack on Sister with Knife: భూవివాదంలో తోడబుట్టిన చెల్లి, ఆమె కుటుంబ సభ్యులపై కత్తులతో దాడికి పాల్పడిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆంగోత్‌ పుత్లీబాయికి, ఆమె సోదరుడు భోజ్యాలాల్‌ మధ్య వారసత్వంగా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల విషయంలో కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి.

కళ్లలో కారం జల్లి...ఆపై..

ఈ నేపథ్యంలో మంగళవారం పుత్లీబాయి, ఆమె భర్త పెరుమాళ్లు, కుమార్తె సుమిత్రలపై భోజ్యాలాల్‌, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడి ఘటనపై బాధితులు మంగళవారం సాయంత్రం జూలూరుపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంఎల్‌సీ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రాత్రి వేళలో కొమ్ముగూడెం వచ్చారు. అప్పటికే మరణాయుధాలతో సిద్ధంగా ఉన్న భోజ్యాలాల్‌, అతని తమ్ముడు సేవాలాల్‌, కుమారుడు పృథ్వీనాయక్‌, కోడలు విజయలు వారి కళ్లలో కారం జల్లారు. ఆపై కత్తులో దాడి చేశారు. ఈ దాడిలో పుత్లీబాయి, ఆమె భర్త, కుతూరికి పొట్ట భాగంలో గాయాలయ్యాయి. బాధితులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌ డా. బి.కుమారస్వామి పర్యవేక్షణలో వైద్యులు తక్షణం స్పందించి చికిత్స అందిస్తున్నారు. దాడికి గురైన వారిలో పెరుమాళ్లు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇదీ చదవండి:బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.. అలా జరిగిపోయింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.