వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. చెరువులు, వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా దందాపై 'దోచేస్తున్నారు' అనే శీర్షీకన ఈటీవీభారత్లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పోలీసు యంత్రాంగం మండలంలోని అంబాల గ్రామశివారులో వాహనాల తనిఖీలను చేపట్టారు.
ఇసుక అక్రమంగా తరలించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనంతరం వాటిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యల కోసం వాటిని తహసీల్దార్‌కు అప్పగించనున్నట్లు ఎస్సై పరమేశ్వర్ స్పష్టంచేశారు.
ఇదీ చూడండి : 'కిలాడీ దంపతులు.. చిట్టీల మోసంలో ఆరితేరారు!