Fake Birth Certificates Gang arrest: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, ఆరు ఫోన్లు, రూ. 19,400 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముఠాలో ప్రధాన నిందితుడు ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ 7 సహాయ వైద్యాధికారి ఎజాజ్ ఖాసీం ఉండటం గమనార్హం. ఖాసీంతో పాటు ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉన్నారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఆకుల సతీష్, మహ్మద్ రసూల్, హుస్సేన్ ఇక్బాల్, మరో ఇద్దరు కలిసి నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను తయారు చేస్తున్నారు.
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.1,500 చొప్పున నిందితులు తీసుకుంటున్నారని పశ్చిమ మండలం డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. వీరి వద్ద నుంచి ఎంతమంది నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు పొందారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పరారీలో ఉన్న సహాయ వైద్యాధికారి ఖాసీం, అంకిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: Land Dispute Fight Live Video: భూ తగాదాలతో రెండు వర్గాల ఘర్షణ.. వీడియో వైరల్