ETV Bharat / crime

పైసలిస్తే నకిలీ కొవిడ్​ రిపోర్టులు, వ్యాక్సినేషన్​ పత్రాలు.. నిందితులు అరెస్ట్​ - Fake Covid Reports in hyderabad

Fake Covid Reports gang arrested in hyderabad: కొవిడ్​ కష్టకాలాన్ని వారు ఉపాధిగా మార్చుకున్నారు. ప్రజల అవసరాన్ని క్యాష్​ చేసుకున్నారు. అందుకే​ నకిలీ రిపోర్టులు, తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి వేలల్లో డబ్బు వసూలు చేశారు. చివరకు వారి మోసం బట్టబయలై పోలీసులకు చిక్కారు. కరోనా నకిలీ ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను హైదరాబాద్ సౌత్​ జోన్​​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు.

Fake Covid Reports
నకిలీ కొవిడ్​ ధ్రువపత్రాలు
author img

By

Published : Jan 21, 2022, 6:21 PM IST

Updated : Jan 21, 2022, 7:45 PM IST

Fake Covid Reports gang arrested in hyderabad: కొవిడ్​ నకిలీ రిపోర్టులు, వ్యాక్సినేషన్‌ తప్పుడు ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను హైదరాబాద్ సౌత్​ జోన్​​ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ ఆర్టీపీసీఆర్​, వ్యాక్సినేషన్‌ పత్రాలను విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ శాంపిల్స్​ తీసుకుని వాటిని ల్యాబ్​కు పంపించి నెగిటివ్​ రిపోర్టులు తయారుచేస్తున్నారు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోకపోయినా నెగిటివ్‌ వచ్చినట్లు సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించి నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు. రెండు డోసులు టీకా తీసుకోకపోయినా వేయించుకున్నట్లు తప్పుడు ధ్రువపత్రాలిస్తున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి 65 ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్లు, 20 నకిలీ శాంపిల్స్​, 1 సెల్​ఫోన్​, 50 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను​ టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ జి.చక్రవర్తి.. మీడియా సమావేశంలో వెల్లడించారు.

కొవిడ్​ నకిలీ రిపోర్టులు విక్రయిస్తున్న ముఠాలు అరెస్ట్​

పైసలిస్తే నెగిటివ్​ సర్టిఫికెట్​

మహబూబ్​నగర్​కు చెందిన లక్ష్మణ్ 2012లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి హైదరాబాద్​లోని పలు ల్యాబ్​లలో పనిచేశాడు. ఏడాది క్రితం మలక్ పేట్​లో హోం కేర్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించాడు. గత రెండు నెలలుగా కొవిడ్ పరీక్షలు చేయించుకునే వాళ్ల సంఖ్య పెరగడంతో ఇళ్ల వద్దకు వెళ్లి నమూనాలు తీసుకొని మెడిసిస్ పాథ్ ల్యాబ్​లలో పరీక్షలు చేయించి రిపోర్టులు ఇస్తున్నాడు. విమాన ప్రయాణికులకు కరోనా నిర్ధరణ పరీక్షలు తప్పనిసరి కావడంతో.. నెగిటివ్ సర్టిఫికెట్ కావాలనుకునే వాళ్ల నుంచి రూ. 3 వేల వరకు తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చాడు.

"కొవిడ్​కు సంబంధించి పరీక్షలు చేయించుకున్నట్లు నకిలీ రిపోర్టులు, వ్యాక్సినేషన్​ తీసుకోకపోయినా ఇచ్చినట్లు నిందితులు ధ్రువపత్రాలు అందిస్తున్నారు. నకిలీ శాంపిల్స్​ తీసుకుని పరీక్షల కోసం ల్యాబ్​కు పంపిస్తున్నారు. తద్వారా రిపోర్టుల్లో నెగిటివ్​ అని తేలుతుంది. అవసరాన్ని బట్టి డబ్బు డిమాండ్​ చేస్తూ ఒక్కో సర్టిఫికెట్​ను​ రూ. 800 నుంచి 2000 వరకు విక్రయిస్తున్నారు."

--- జి. చక్రవర్తి, టాస్క్​ఫోర్స్​ అదనపు డీసీపీ

మరో కేసులో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ వాక్సినేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాక్సిన్ తీసుకోకున్నా.. రెండు డోసులు తీసుకున్నట్లు ఈ ముఠా సర్టిఫికెట్లను ఇస్తోంది. హుమాయున్ నగర్​లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేస్తున్న కుమారి అనే మహిళతో కుమ్మక్కై ఈ ముఠా నకిలీ వాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదీ చదవండి: Remand to drug peddler Tony : అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి 14 రోజుల రిమాండ్

Last Updated : Jan 21, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.