Hyderabad Delivery Boy death: ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఉన్న కుక్కకు భయపడి భవనం మీది నుంచి దూకిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్విగ్గీ బాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌లో నివసించే రిజ్వాన్ ఈనెల 10న బంజారాహిల్స్ రోడ్ నంబరు 6లోని లుంబిని రాక్ క్యాజిల్ అపార్ట్‌మెంటు మూడో అంతస్తులోని శోభన నాగని ఆర్డర్ చేసిన ఆహారాన్ని అందించేందుకు రాత్రి 10 గంటల ప్రాంతంలో వెళ్లాడు.
తలుపు తట్టగానే జర్మన్ షపర్డ్ శునకం దూసుకురావడంతో కిందకు దూకిన సంగతి విదితమే. శునకం యజమాని శోభన పంజాగుట్టలోని నిమ్స్ అతడిని చేర్పించి వైద్య ఖర్చులు భరిస్తున్నారు. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం రాత్రి మృతి చెందాడు. ఇప్పటికే శోభన నాగనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతి నేపథ్యంలో సెక్షన్లు మారుస్తామని పేర్కొన్నారు.
యువకుడి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో అన్ని తానై కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి మరణంతో కన్నీరుమున్నీరవుతున్నారు. రిజ్వాన్‌కు నలుగురు సోదరులు ఉండగా, వారిలో ముగ్గురికి, తండ్రికి మతిస్థిమితం లేదు. రిజ్వాన్‌తో పాటు మరో సోదరుడు ఖాజా మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తల్లి కొద్ది కాలం క్రితమే మృతిచెందారు. ఇప్పుడు రిజ్వాన్ మృతి చెందడంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా మారిందని బంధువులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: