ETV Bharat / crime

KARVY CASE: పోలీసుల కస్టడీలోకి కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి

karvy chairman police custody
karvy chairman police custody
author img

By

Published : Aug 25, 2021, 12:10 PM IST

Updated : Aug 25, 2021, 1:00 PM IST

12:08 August 25

పోలీసుల కస్టడీలోకి కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి

karvy chairman police custody
పోలీస్​ కస్టడీలో కార్వీ ఛైర్మన్​ పార్థసారథి

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని.. నాంపల్లిలోని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. నేడు, రేపు పార్థసారథిని ప్రశ్నించనున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసినందుకు పార్థసారథిపై సీసీఎస్​లో కేసు నమోదైంది. ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.  

ఇండస్ ఇండ్ బ్యాంకులో రూ.137 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి... ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్దంగా పెట్టుబడిదారుల షేర్లను తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు నాంపల్లి న్యాయస్థానం ఆదేశాలతో రెండు రోజుల పాటు పార్థసారథిని ప్రశ్నించనున్నారు.  

సైబరాబాద్​ పరిధిలోనూ కేసులు..

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ తరఫున హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లోనూ పార్థసారథి, మిగతా ప్రమోటర్లు కలిసి రుణం తీసుకున్నారు. హెచ్​డీఎఫ్​సీలో రూ.347 కోట్లు, ఐసీఐసీఐలో రూ.520 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంకులో రూ. 137 కోట్ల రుణం తీసుకొని ఎగవేశారు. సైబరాబాద్ కమిషనరేట్​లోనూ పార్థసారథి, మిగతా డైరెక్టర్లపై కేసు నమోదైంది. 

రుణంగా తీసుకున్న డబ్బును ఎక్కడికి మళ్లించారనే విషయాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. మోసం కేసులో మిగతా డైరెక్టర్ల పాత్ర ఏమేర ఉందనే కోణంలోనూ పార్థసారథిని పోలీసులు అడిగి తెలుసుకోనున్నారు.  

ఇదీచూడండి: ఒక్కొక్కటిగా బయటపడుతున్న కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ మోసాలు

Last Updated : Aug 25, 2021, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.